HNK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పింక్ చీర, మల్లెపూలను బహుమానంగా పంపారు. ఎన్నికల ప్రచారంలో సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ బహుమతి పంపినట్లు శనివారం పవన్ తెలిపారు.