గుంటూరు రూరల్ వెంగళాయపాలెంలో ఇటీవల మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు బన్నీకి సహకరించిన అతడి తల్లి, అమ్మమ్మలను డీఎస్పీ భానోదయ శనివారం అరెస్ట్ చేశారు. బాలికను నెల్లూరుకు తరలించి, బలవంతంగా తాళి కట్టి, అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోక్సో చట్టం ప్రకారం సహకరించిన వారికి కూడా శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.