కోనసీమ: నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొత్తపేట జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జనార్ధన స్వామి వారి ఆలయంలో జరిగిన శాంతి కల్యాణంలో పాల్గొనడం స్వామివారి అనుగ్రహమని బండారు శ్రీనివాస్ అన్నారు.