ATP: సెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలోని స్తోత్రియం భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ ఆ భూములను సాగు చేస్తున్న రైతులు శనివారం స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. భూములను కబ్జా చేస్తున్న వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాని తహసీల్దార్‌కు అందజేశారు.