VZM: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో నిర్వహించిన ‘పుస్తక హుండీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు MVN వెంకట్రావు సహా పలువురు పాల్గొని పుస్తకాలను దానం చేశారు. సేకరించిన పుస్తకాలను డిగ్రీ కళాశాల లైబ్రరీతోపాటు అవసరమున్న పలు గ్రంథాలయాలకు దానం చేస్తామని వారు తెలిపారు.