PLD: పిడుగురాళ్ల పట్టణంలో, పిల్లుట్ల రోడ్డు, లెనిన్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా, పాఠశాల పరిసరాలను మున్సిపల్ కార్మికులతో శుభ్రం చేయించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.