W.G: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర’ కార్యక్రమం భీమవరం ఝాన్సీ లక్ష్మీబాయి పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రత అనేది ప్రతి ఒక్కరూ పాటించవలసిన ప్రథమ బాధ్యతని తద్వారానే సామూహిక శుభ్రత అనేది సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు