KDP: పులివెందుల మండలం చిన్న రంగాపురంలో శుక్రవారం అర్ధరాత్రి వంశీ కృష్ణ (30) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాల వద్ద ఫోన్ చూసుకుంటున్న వంశీకృష్ణపై, అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో వెనుక నుంచి కొడవలితో మెడ, తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.