NTR: పెనుగంచిప్రోలు మండలం నవాబ్‌పేటలో ఎకరం 3.50 సెంట్లలో వెలసిన అనధికార లే అవుట్‌ను CRDA అధికారులు శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ మేరకు లే అవుట్‌ను ప్రొక్లైనర్తో ధ్వంసం చేశారు. సరైన అనుమతులు తీసుకోకుండా వెలసిన లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని, ఈ తరహా లే అవుట్లపై 0866-2527154 నంబర్లో ఫిర్యాదు చేయాలని CRDA కమిషనర్ కే.కన్నబాబు సూచించారు.