సత్యసాయి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ఈ నెల 16న పుట్టపర్తికి రానున్నారు. ఆయన సాయి సన్నిధిలో జరిగే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సీజేఐ పర్యటన దృష్ట్యా పుట్టపర్తిలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులను పెద్ద సంఖ్యలో విధులకు కేటాయించారు.