పెద్దపల్లి జిల్లాలోని శుక్రవారం సమీకృత కలెక్టరేట్లో సెర్ఫ్ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వశక్తి మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రతి సంఘం ఆదాయ మార్గాలను పెంచుకోవాలని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.