NDL: బేతంచెర్ల మండలం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీమద్దిలేటిస్వామి క్షేత్రంలో ఇవాళ జిల్లా నలుమూలల నుంచి భక్తులు కిక్కిరిసినారు. భక్తులు తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. మహిళలు ధ్వజ స్థంభం వద్ద కార్తీకదీపాలు వెలుగించడంతో ఆలయం వైభవంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈవో రామాంజనేయులు ఏర్పాటు చేశారు.