నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల సంభవించిన ర్యాగింగ్ సంఘటనలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం యాంటీ-ర్యాగింగ్ జిల్లా సాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ర్యాగింగ్ ఉదంతాలపై సమగ్రంగా చర్చించిన కమిటీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తెలుసుకోవాల్సిన కఠిన చర్యలపై నిర్ణయం తీసుకుంది.