ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 16న హీరో కంపెనీ జాబ్ మేళా నిర్వహిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.