TG: రాష్ట్రంలో రానున్న 2-3 రోజలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.