చలికాలంలో వ్యాయామం చేసేవారు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. వ్యాయామానికి ముందు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వార్మప్ చేస్తే గాయాలు కాకుండా నివారించవచ్చు. పొరలు పొరలుగా దుస్తులు ధరించడం, వ్యాయామం చేసేటప్పుడు శరీరం వేడెక్కుతుంది. అందుకే ఉష్ణోగ్రతకు అనుగుణంగా తీసివేయడానికి వీలుగా పలుచని దుస్తులు ధరించాలి. లోపలి పొర చెమటను పీల్చుకునే విధంగా ఉండాలి.