NLR: చేజర్ల మండలం ఏటూరు కండ్రిక వద్ద శుక్రవారం గేదెను బైకు ఢీకొట్టింది. నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ముప్పసాని బాబు పోస్టల్ శాఖలో పనిచేస్తున్నారు. పొదలకూరు నుంచి పని ముగించుకుని తన గ్రామానికి తిరిగి వస్తుండగా గేదెను ఢీకొనడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు 108 సాయంతో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.