AP: సీఐఐ సదస్సులో సింగపూర్ బృందంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. సీఎం చంద్రబాబు, సింగపూర్ హోంమంత్రి షణ్ముగం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్ అంశాలు, డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, సుస్థిరాభివృద్దిపై అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. విజయవాడ – సింగపూర్ మధ్య విమాన సర్వీసు నడపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.