ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దు. అలాగే బ్రేక్ ఫాస్ట్ రాజులా, లంచ్ ప్రిన్స్లా, డిన్నర్ బిచ్చగాడిలా తినాలని అంటారు. అంటే ఉదయం ఎక్కువ తినాలి. మధ్యాహ్నం కొంచెం తక్కువ. రాత్రి ఇంకా తక్కువ తినాలి. అంతేకాదు ఉదయం, రాత్రి 8 గంటలలోపు తినాలి. అప్పడే ఒబెసిటీ, డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలు దగ్గరికి రావు. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం బెటర్.