SRCL: చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రలేఖనం, పాటలు పాడడం, నృత్యాలు చేయడంతో పాటు బెలూన్స్‌తో చేసిన జోకర్ బెలూన్ మ్యాన్‌తో సరదాగా ఆడుతూ పాడుతు గడిపారు.