MBNR: ట్రాక్టర్ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని సూరారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బిక్షపతి (53) సూరారం వాగు నుంచి ఇసుకను తీసుకుని ఫరూక్ నగర్ మండలంలోని చౌలపల్లి గ్రామానికి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్ధానిక ఆసుపత్రికి తరలించారు.