TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమిపై BRS అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి విజయం సాధించినట్లు ఆరోపించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రౌడీయిజం చేసి గెలిచారని చెప్పారు. దీన్ని గెలుపు అనుకుంటారని తాను అనుకోవట్లేదని.. నైతికంగా తానే గెలిచినట్లు చెప్పుకొచ్చారు.