KDP: సదరం స్లాట్ బుకింగ్ ఇవాళ నుంచి ప్రారంభం అవుతుందని ఇప్పటివరకు పొందని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆల్ ఆఫ్ యు దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ అఫ్జల్ తెలిపారు. అందుబాటులోని సచివాలయం, మీ సేవల్లో స్లాట్ బుకింగ్ చేసుకుని ఇచ్చిన తేదీల్లో క్యాంపునకు హాజరై సదరం ద్రువపత్రం పొందాలని తెలిపారు.