TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అధికార కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ఎవరు గెలిచినా సంబరాలు మిన్నంటడం ఖాయం. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషన్ RV కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉందని.. ఎవరు గెలిచినా విజయోత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.