TG: రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఇవాళ తేలనుంది. అందరి దృష్టి ఈ ఫలితంపైనే ఉంది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోగా ఫలితం తేలనుంది. దీంతో ప్రతి ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.