»The Robbery Done By Kcr Even The British Rulers Cannot Do It Revanth Reddy
Revanth Reddy: KCR చేసిన దోపిడీ..బ్రిటిష్ పాలకులు కూడా చేయలే
తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన మనుషుల సంపద దాహాన్ని తీర్చేందుకే జీఓ 111ని రద్దు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఈ క్రమంలో జీవో 111 రద్దు చేయడం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుందని పేర్కొన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్(cm kcr) చేసినంత దోపిడీ విధ్వంసం బ్రిటిష్, నిజాం, ఆంధ్రా పాలకులు కూడా చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. జీవో 111ను రద్దు చేయడం ద్వారా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం, అనుచరులు లబ్ధి పొందుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఆఫ్రికాలో ఇదీ అమీన్ అనే నేరస్థుడు నరమాంస భక్షణలో మునిగి ఉండేవాడు. కేసీఆర్ తనకంటే ప్రమాదకరమన్నారు. కేసీఆర్‌కు మరో నాలుగు నెలల సమయం ఉందని ఈ కాలంలో వీలైనంత దోచుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
సిఎం కె చంద్రశేఖర్‌రావు, మంత్రి కెటి రామారావు(KTR), సీఎం ముఖ్య సలహాదారు సోమేష్‌కుమార్, ఎంఎయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ల ధన దాహాన్ని తీర్చేందుకే నిబంధనలు పాటించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాళ్లతో కొట్టి చంపడంలో తప్పు లేదని ఆయన అన్నారు.
1908 నాటి మహా మూసీ వరదల తర్వాత వరదలను అరికట్టడంతోపాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలను చేపట్టొద్దని జీఓ 111 ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేయడం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుతుందని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీఓ 111 పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో 20 శాతం భూములు కూడా సామాన్య ప్రజల ఆధీనంలో లేవని రేవంత్ వెల్లడించారు.