మన్యం: కొమరాడ మండలంలో సంచరిస్తున్న ఏనుగులను తరలించాలని గురువారం సీపీఎం మన్యం జిల్లా నాయకులు సాంబమూర్తి డిమాండ్ చేశారు. మండలంలో కొత్తవలస సమీపంలో మేకల మంద వద్దకు ఏనుగులు గుంపు చేరుకోవడంతో వాటితో పాటు కాపలాదారులు పరుగులు తీయడంతో ప్రాణపాయం తప్పిందన్నారు. డిప్యూటీ సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఏనుగులను తరలించాలని, నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.