విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య పుకార్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్ అని.. ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అనేది వాళ్ల మాట. అయినా రౌడీ వల్లే రష్మికకు బాలీవుడ్లో భారీ ఆఫర్లు వస్తున్నట్టు టాక్. కానీ ఇప్పుడు లైగర్ ఎఫెక్ట్ ఈ హాట్ బ్యూటీ పై పడినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో భారీ ఆఫర్లు అందుకుంటోంది. ఎలాగు భారీ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప2 రష్మిక చేతిలోనే ఉంది. దీంతో పాటు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్వల్ మూవీ ‘వారసుడు’లోను నటిస్తోంది. ఇక హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్.. సినిమాలు చేస్తోంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
అయితే హీరో టైగర్ ష్రాఫ్ సరసన రష్మిక ఓ సినిమాలో ఓకే అయినట్టు గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఇటీవలె ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్గా’లైగర్’ సినిమాలో కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లైగర్ రిజల్ట్ తలకిందులవడంతో.. బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కరణ్. అందుకే టైగర్ ష్రాఫ్ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్టు టాక్. ఇదే నిజమైతే లైగర్ ఎఫెక్ట్ రష్మిక పై కూడా పడిందని చెప్పొచ్చు. అంతేకాదు రష్మిక లిస్ట్ లో నుంచి ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎగిరిపోయిందనే చెప్పాలి.