VZM: బొబ్బిలి మండలం కమ్మవలస పంచాయతీ పరిధిలోని ముత్తావలసలో జరుగుతున్న పారిశుధ్య పనులను సర్పంచ్ పిల్లా వసుంధర గురువారం పరిశీలించారు. గ్రామంలోని డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు. ప్రజలు కూడా పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు.