Aditya Singh Rajput : టీవీ నటుడు ఆదిత్య సింగ్ అనుమానాస్పద మృతి
ఆదిత్యసింగ్ రాజ్పుత్(Aditya Singh Rajput) ముంబైలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఆదిత్యసింగ్ను కలిసేందుకు అతని స్నేహితుడు వెళ్లగా బాత్రూమ్లో పడిపోయి ఉన్నాడు. వాచ్మెన్ సాయంతో ఆదిత్యసింగ్ను ఆస్పత్రి(Hospital)కి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
టీవీ నటుడు, మోడల్ అయిన ఆదిత్య సింగ్ రాజ్పుత్(Aditya Singh Rajput) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తన ఇంటి బాత్రూమ్లో ఆదిత్య సింగ్ విగతజీవిగా పడి ఉండటంతో ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు(Police) కేసు నమోదు చేసి స్థానికులను విచారిస్తున్నారు.
ఆదిత్యసింగ్ రాజ్పుత్(Aditya Singh Rajput) ముంబైలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఆదిత్యసింగ్ను కలిసేందుకు అతని స్నేహితుడు వెళ్లగా బాత్రూమ్లో పడిపోయి ఉన్నాడు. వాచ్మెన్ సాయంతో ఆదిత్యసింగ్ను ఆస్పత్రి(Hospital)కి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణను ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అతని మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిత్యసింగ్ (Aditya Singh Rajput) డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్ల మరణించాడనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో ఆదిత్య సింగ్ నటించారు. ఎంటీవీ ప్రసారం చేసే స్ప్లిట్స్ విల్లా 9 సీజన్ ద్వారా ఆదిత్యకు మంచి పేరొచ్చింది. ఆదిత్య సింగ్ ఐదు రోజుల క్రితం కూడా ఒక పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.