కృష్ణా: చింతగుంటపాలెం గ్రామంలో పీఎంఏవై అర్బన్ 1.0 పథకం కింద కుప్పా శ్రీనివాసరావు, సిద్ధినేని యానాది రావు నిర్మించుకున్న గృహాలను APSRCT ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి కలెక్టర్ బాలాజీ బుధవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారునికి సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవడానికి రూ 2.50,000 నగదు ఇస్తుందని తెలిపారు.