ఇప్పుడంతా ఓటీటీ(OTT)ల ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది థియేటర్లలో కంటే ఇంట్లోనే కూర్చోని ఓటీటీల్లో సినిమాలు(Movies) చూడ్డానికి ఇష్టపడుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్(Amazon Prime), హాట్ స్టార్, జీ5 (Zee 5), ఆహా(AHA) వంటి ఓటీటీలు పోటీపడుతున్నాయి. వీటిల్లో కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, ఎంటర్టైన్మెంట్ షోలు కూడా సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.
ఈ మధ్యకాలంలోనే నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ ఇండియాలో తన మార్కెట్ ను పెంచుకునేందుకు సొంత కంటెంట్ చేయడం ప్రారంభించింది. సోనీ లివ్(Sony Live) కూడా సౌత్ భాషల్లో దాదాపుగా 40 సిరీస్‌లు, సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే మన తెలుగు ఓటీటీ అయిన ఆహా(AHA) కూడా ప్రతి శుక్రవారం ఓ సినిమాను రిలీజ్ చేస్తూ వస్తోంది. జీయో(Jio) కూడా ఓటీటీగా మారి ఏకంగా 100 సినిమాలు, సిరీస్‌లు చేస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా ఇప్పుడు జీ5(Zee 5) ఓటీటీ సంస్థ కూడా ఏకంగా ఒకేసారి 111 సినిమాలు(Movies), సిరీస్(Web series)లు చేస్తున్నట్లు ప్రకటించింది. జీ5కి ఇండియాలో మంచి మార్కెట్ ఉండటంతో సౌత్ భాషల్లో లోకల్ కంటెంట్‌ను అందించేందుకు ప్లాన్ చేసింది. త్వరలోనే 111 సినిమాలు, సిరీస్‌లు జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి.