ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ మోడ్(ఆన్ లైన్-ఆఫ్ లైన్)లో పాఠశాలలు బోధన కొనసాగించాలని ఆదేశించింది. తల్లిదండ్రుల సౌకర్యాన్ని బట్టి విద్యార్థులు ఆన్ లైన్ పాఠశాలకు హాజరయ్యే విధంగా అవకాశం కల్పించాలని సూచించింది. చిన్న పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.