బీహార్లో ఊహించని రీతిలో ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 47.62 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రోహ్తాస్ జిల్లా కర్గహర్ నియోజకవర్గంలోని కోనార్ గ్రామంలో పీకే ఓటు వేశారు. బీహార్లో మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లు ముందుకొచ్చి తమ హక్కను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.