ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, కవి అందెశ్రీ మరణంతో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి, అధికారులు 2 నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ అధికారిక గీతం రాసిన ఆయన గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలిపారు.