AKP: పాయకరావుపేటకు చెందిన పెద్దిరెడ్డి చిట్టిబాబు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. కాపుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఆయనను రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ విలియం కేరి అభినందించారు.