CTR: చెక్కునత్తం పంచాయతీ దోలగుట్ట గిరిజన వాడలో మౌలిక వసతుల కల్పనకు సోమవారం సచివాలయ అధికారులు స్థానిక టీడీపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మణి తెలిపారు.