KKD: కిర్లంపూడి మండలం సోమవరం జాతీయ రహదారిపై పెళ్లి కారు భీభత్సం సృష్టించిన ఘటనలో చికిత్స పొందుతూ మరో యువతి మృతిచెందింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న జగ్గంపేట మండలం ఇర్రిపాకకు చెందిన యువతి కూండ్రపు దుర్గా చైతన్య ఇవాళ ఉదయం మరణించింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది.