SKLM: కార్తీకమాసం మూడవ సోమవారం సందర్భంగా టెక్కలి మండలం రావివలసలోని శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. వేకువజాము నుంచే “హర హర మహాదేవా” నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ అర్చకులు శివనామస్మరణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.