KDP: కార్తీకమాసం మూడో సోమవారం పురస్కరించుకుని రేపు కాజీపేటలోని శ్రీ నాగ నాగేశ్వర కోన నుంచి గుడికి వెళ్లే కొండ దారిలో వాహనాలకు అనుమతి లేదని సీఐ వంశీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృశ్య ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆటోల ద్వారా భక్తులు స్వామి వారి కొండపైకి వెళ్లి దర్శించుకోవాలని కోరారు.