KMM: 20 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి కొనుగోళ్లలో ఉన్న నిబంధనలపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్తో ఫోన్లో ఆదివారం మాట్లాడారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని తక్షణమే ఎత్తివేసి, పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి సూచించారు.