»Was There Such A Big Fight Between Radhika And Sridevi
Radhika – Sridevi: రాధిక- శ్రీదేవికి పడదా.. వారి మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..!
తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది హీరోయిన్ శ్రీదేవి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ అయ్యారు. వందల కొద్ది చిత్రాల్లో నటించి తన అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
Radhika – Sridevi: తెలుగు ఇండస్ట్రీలో ఆ కాలంలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది హీరోయిన్ శ్రీదేవి(Sridevi). ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ అయ్యారు. వందల కొద్ది చిత్రాల్లో నటించి తన అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్(tollywood) లోనే కాకుండా బాలీవుడ్(Bollywood) చిత్రాలలో కూడా ఈమె నటించి దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. కొత్త హీరోయిన్లకు ఆమె ఓ రోల్ మోడల్.. శ్రీదేవితో పాటు ఆ టైంలో లైమ్ లైట్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి వారిలో జయప్రద , భానుప్రియ, సుహాసిని, రాధ తదితరులు ఉన్నారు. వారు కూడా బాలీవుడ్ లో కూడా నటించినప్పటికీ ఆమె స్థాయిలో ఎదగలేకపోయారు. శ్రీదేవి సోలో హీరోయిన్ గానే కాకుండా ఇతర హీరోయిన్స్ తో కూడా కలిసి నటించింది. కృష్ణ(Krishna) ,శోభన్ బాబు ,ఏఎన్నార్, ఎన్టీఆర్(NTR) తదితర నటులతో శ్రీదేవి ఎక్కువ సినిమాలలో నటించింది. అయితే హీరోయిన్ రాధికా(Radhika) తో శ్రీదేవి కలిసి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.
శ్రీదేవి కి జయప్రద తో విభేదాలు ఉండేవని అప్పట్లో ఎక్కువగా పుకార్లు వినిపించాయి. అలాగే హీరోయిన్ రాధిక తో కలిసి నటించినప్పుడు కూడా గొడవలు జరిగాయని సమాచారం. అంతకు ముందు వారు కలిసి ఉండడమే కాకుండా పలు రకాల షాపింగ్ కూడా చేసేవారట. కానీ ఒకసారి తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో రాధిక , శ్రీదేవి కలిసి నటించారు . ఆ సమయంలోనే శ్రీదేవితో సమానంగా రెమ్యూనరేషన్ కావాలంటూ రాధిక డిమాండ్ చేసిందట. ఆ విషయం అక్కడ పెద్ద వివాదానికి దారితీసిందట.. దీంతో గొడవ పెద్దదవుతుంది అని తెలిసి నిర్మాత శ్రీదేవిని రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోమని కోరాడట.. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో వీరీద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది అని తెలిసి నిర్మాత రాధికను తీసేసి సరితను హీరోయిన్ గా తీసుకున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.