Bichagadu 2: ఫస్ట్ డే కలెక్షన్స్.. అస్సలు ఊహించలేదుగా!
2016లో విజయ్ ఆంటోనీ హీరోగా.. దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. ఇక ఇప్పుడు సీక్వెల్ మూవీ(bichagadu 2) కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. డే వన్ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.
బిచ్చగాడు సినిమాతో తెలుగులోను మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. దాంతో బిచ్చగాడుకి సీక్వెల్‌గా వస్తున్న బిచ్చగాడు 2(bichagadu 2)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 19న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా.. దర్శకత్వం వహించి, మ్యూజిక్ కూడా అందించాడు. విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన కూడా.. ఈ సీక్వెల్ అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.
తెలుగు, తమిళంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగులోనే 2 కోట్లకు పైగా షేర్, 4 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందంటున్నారు. ఈ సినిమా మొత్తం తెలుగు బిజినెస్ 6 కోట్లు. దీంతో తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.50 కోట్లు. ఈ లెక్కన సినిమా తెలుగు బ్రేక్ ఈవెన్ కోసం మరో 4 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్, 8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బిచ్చగాడు డే వన్ 4 కోట్లు వచ్చాయి అంటే..మరో 12 కోట్లు రాబడితే ఈ మూవీ లాభాల బాట పడుతుంది. మొత్తంగా బిచ్చగాడు2 డే వన్ భారీ వసూళ్లను రాబట్టిందని చెప్పొచ్చు.