Siddaramaiah: కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణం
కర్ణాటకగవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు.
Siddaramaiah:కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కంఠీరవ స్టేడియంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ సీఎంగా సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేశారు.
సిద్ధరామయ్య (Siddaramaiah) వేదికపై వచ్చి అభివాదం చేయగానే అభిమానుల నినాదాలతో హోరెత్తింది. కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక రెండోసారి పదవీ స్వీకరించారు. 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రి పదవీ చేపట్టిన సంగతి తెలిసిందే.
డిప్యూటీగా ప్రమాణం చేసేందుకు డీకే శివకుమార్ (DK Shivakumar) వచ్చిన సందర్బంలో అభిమానుల నినాదాలతో స్టేడియం మారుమోగింది. ఈ ఎన్నికల్లో డీకే శివకుమార్ ముఖ్య పాత్ర పోషించారు. సీఎం పదవీ కోసం పట్టుబట్టి.. హైకమాండ్ సూచన మేరకు డిప్యూటీ సీఎం పదవీ చేపట్టేందుకు అంగీకరించారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా డీకే శివకుమార్ డ్రెస్
ప్రమాణ స్వీకార మహోత్సవంలో డీకే శివకుమార్ డ్రెస్ ఆకట్టుకుంది. ఆయన పట్టు షర్ట్, పంచె కట్టుకున్నారు. ఈ డ్రెస్ తన కూతురు పెళ్లి సమయంలో ధరించారని.. మరోసారి ఈ రోజు వేసుకున్నారు. శుభసూచకంగానే డ్రెస్ ధరించారు. తొలుత సీఎం పదవీ కోసం పట్టుబట్టిన తర్వాత మెట్టుదిగారు. రాహుల్, ప్రియాంక సహా సీఎంలను ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లి మరీ రిసివ్ చేసుకున్నారు.
కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు కంఠీరవ స్టేడియంలో ఆశీనులు అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎంలు హేమంత్ సోరెన్, భూపేశ్, అశోక్ గెహ్లాట్, స్టాలిన్, నితీశ్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ప్రముఖ నటుడు కమల్ హాసన్, శివరాజ్ కుమార్, విజయ్ హాజరయ్యారు.