»Ravi Tejas Pan India Movie Which Is Raising Tremendous Hype Five Star Heroes In The Fie
Raviteja : రవితేజ కోసం రంగంలోకి దిగుతున్న ఐదుగురు స్టార్ హీరోలు
కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు రవితేజ(Raviteja). పూరీ జగన్నాథ్(Puri jaganath) డైరెక్షన్లో వచ్చిన ఇడియట్(Idiot) సినిమాతో స్టార్ డమ్ అందుకున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నిర్మాతల(Producers) పాలిట వరంగా మారారు. తనదైన మార్క్ యాక్షన్ తో మాస్ మహారాజ ఇమేజ్ సంపాదించుకున్నారు.
Raviteja : కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు రవితేజ(Raviteja). పూరీ జగన్నాథ్(Puri jaganath) డైరెక్షన్లో వచ్చిన ఇడియట్(Idiot) సినిమాతో స్టార్ డమ్ అందుకున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నిర్మాతల(Producers) పాలిట వరంగా మారారు. తనదైన మార్క్ యాక్షన్ తో మాస్ మహారాజ ఇమేజ్ సంపాదించుకున్నారు. కెరీర్లో ఎన్ని ప్లాపులు వచ్చిన ఒక్క హిట్ తో పాత గుర్తులను చెరిపేసే హీరో రవితేజ. ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇటీవలే ధమాకా(Dhamaka), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya ) సినిమాలతో ప్రేక్షకులను అలరించి వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. వీటి తర్వాత విడుదలైన రావణాసుర(Ravanasura ) సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేదు.
ప్రస్తుతం ఆయన హీరోగా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో వంశీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా(Pan India) సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన తాజా అప్ డేట్స్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల విపరీతమైన హైప్ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ఓ విషయం సినిమా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రవితేజ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao). తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ఇది విడుదల కానుంది. ఆయా భాషల్లో ఈ సినిమా పట్ల హైప్ పెంచేందుకు ఐదుగురు హీరోలు ముందుకు రానున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో రజనీకాంత్ విడుదల చేయనున్నారు. ఇక కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఏ స్టార్ హీరో విడుదల చేస్తారో ఇంకా స్పష్టత లేదు. ఆసక్తికర విషయం ఏంటంటే చాలా కాలం తర్వాత పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. హీరోకు సోదరి పాత్రలో ఆమె నటించనున్నారని సమాచారం.