»Government Considering Setting Up 8 New Cities Across India Report
8 New Cities: దేశంలో కొత్తగా 8 నగరాలు..!
దేశంలో ప్రస్తుతం ఉన్న పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించేందుకు ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో కేంద్రం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫారసు చేసిందని ఈ మేరకు వెల్లడించారు.
ఇప్పటికే మన దేశం(india)లో చాలా నగరాలు ఉన్నాయి. అయితే, కొత్తగా మరో 8 నగరాల(8 New Cities)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ విషాయన్ని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. దేశంలోని చాలా మంది ప్రజలు పట్టణాలు, నగరాలపై మోజు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. దీంతో ఈ ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కొత్త నగరాల ఏర్పాటు దిశగా యోచిస్తోంది. దేశంలో మొత్తం ఎనిమిది నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో గురువారం జరిగిన ‘అర్బన్ 20’ సమావేశానికి కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ హాజరయ్యారు. సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త నగరాల గురించి ప్రస్తావించారు. 15వ ఆర్థిక సంఘం కొత్త నగరాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. పలు రాష్ట్రాలు ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం 8 కొత్త నగరాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.