గత ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తర్వలోనే చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ యజమాని డియాజియో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించాయి.