CTR: నగరి నియోజకవర్గంలో పలువురికి CMRF చెక్కులు మంజూరు అయినట్టు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు వాటిని ఆయన పంపిణీ చేశారు. పుత్తూరు మున్సిపాలిటీలో ఇద్దరికి, నిండ్ర మండలంలో ఒకరికి, నగిరి మున్సిపాలిటీ పరిధిలో 12 మంది అనారోగ్యంతో చికిత్స చేసుకున్నారని ఆయన తెలిపారు. దీంతో మొత్తం 15 మందికి రూ. 5.37 లక్షల విలువ చేసే చెక్కులను ఆయన అందజేశారు.