VZM: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు వారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు బొండపల్లి విద్యార్థులు ప్రదర్శించిన హైజీన్ ఫర్ ఆల్ ఎంపికైంది.