KNR: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన కొమ్ముల సంపత్ కుమార్ను గ్రామ బ్రిస్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్థులు, అసోసియేషన్ సభ్యులు కొత్త అధ్యక్షుడికి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణానికి మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తానన్నారు.